NZB: గత మూడు రోజులుగా చలి గజగజ వణికిస్తోంది. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. సాయంత్రం నుంచి మొదలైన చలి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు పంజా విసురుతోంది. పెరిగిన చలి తీవ్రతను తట్టుకోలేక చాలామంది ఎండలో నిలబడి ఉపశమనం పొందుతున్నారు. చలి తీవ్రత వల్ల చాలా మంది సర్ది, దగ్గు, జ్వరాల బారిన పడి కొందరు ఆసుపత్రుల్లో చేరుతున్నారు.