JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి శనివారం భక్తుల నుంచి ఆదాయం సమకూరింది. టికెట్ల విక్రయాలు, ప్రసాదాల విక్రయాలు, అన్నదానం సేవ ద్వారా ఆలయానికి మొత్తం రూ. 4,27,073 ఆదాయం నమోదైంది. టికెట్ల ద్వారా 2,30,514, ప్రసాదాల ద్వారా రూ.1,52,140, అన్నదానం సేవ ద్వారా రూ.44,419 ఆదాయం వచ్చిందని ఆలయ అధికారి తెలిపారు.