KMM: కామేపల్లి మండలంలో పోలింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని కామేపల్లి సీఐ ఎన్. సాగర్, కామేపల్లి ఎస్సై పి. శ్రీకాంత్ తెలిపారు. మండలంలోని 18 పంచాయతీల్లో ఇవాళ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు వారు తెలిపారు.