»An Attempt To Sexually Assault An Actress Who Went To Kbr Park Banjara Hills
KBR Park:కు వెళ్లిన నటిపై లైంగిక దాడికి ప్రయత్నం!
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్కులో సినిమా రంగంలో పనిచేసే ఓ నటిపై లైంగిక దాడి యత్నం జరిగింది. ఈ ఘటనపై ఆమె బంజారాహిల్స్ పోలీసులకు తెలిపింది. అయితే రెండేళ్ల క్రితం కూడా తనను ఓ వ్యక్తి వెంబడించి రాయితో బెదిరించి ఫోన్, పర్స్ లాక్కెళ్లాడని వెల్లడించింది.
హైదరాబాద్(hyderabad) బంజారాహిల్స్(banjara hills)లోని కేబీఆర్ పార్కు(KBR Park)లో ఓ మూవీ నటి(actress)పై లైంగిక దాడి(sexually assault)యత్నం జరిగింది. ఈ ఘటనపై ఆమె బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆమె ప్రతి రోజు సాయంత్రం సమయంలో వాకింగ్ కోసం పార్కుకు వెళ్లగా ఓ వ్యక్తి తనను వెంబడించే వాడని ఆమె పోలీసులకు తెలిపింది. రాత్రి ఏడు గంటల సమయంలో పార్కులో నడుస్తుండగా తనను ఓ దుండగుడు ఫాలో అయ్యే వాడిని చెప్పింది. ఆ క్రమంలో తాను ఎక్కడ ఆగిపోతే.. అతను కూడా ఆగేవాడని తెలిపింది. అలా నాలుగైదు సార్లు గమనించి అక్కడి పార్కు సిబ్బంది చెప్పినట్లు వెల్లడించింది. ఆ క్రమంలో అతన్ని పట్టుకుని కొండాపూర్(kondapur) పోలీసులకు విషయం తెలిపామని చెప్పుకొచ్చింది.
ఈ క్రమంలో బంజారాహిల్స్(banjara hills) పోలీసులు(police) అతడిని అదుపులోకి తీసుకుని ఆరా తీయగా..అతని పేరు శేఖర్ అని తేలింది. అతను సంబంధం లేకుండా సమాధానాలు చెబుతుండటంతో మరిన్ని వివరాలు తెలుసుకుంటున్నారు. మరోవైపు ఇదే నటిపై రెండేళ్ల క్రితం కూడా ఓ ఆగంతకుడు వెంటపడినట్లు ఆమె తెలిపింది. అప్పుడు ఆ దుండగుడు తనను వెంటాడి లైంగిక దాడి(sexually assault)కి ప్రయత్నించాడని పేర్కొంది. అది సాధ్యం కాకపోవడంతో రాయితో బెదిరించి మొబైల్, పర్స్ దోచుకెళ్లాడని వెల్లడించింది. అయితే ఇదే నటిపై రెండు సార్లు దుండగుడు వెంటపడటం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఇదిలా ఉంటే అసలు పార్కుల్లో కూడా సీసీ కెమెరాలు(cc cameras) ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. ఏదైనా జరగరానిది జరిగితే ఏవరు బాధ్యత వహిస్తారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుండగులు పార్కుల్లోకి వచ్చినపుడు లేదా ఎవరినైనా ఇబ్బంది పెట్టినపుడు తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు(police) కోరుతున్నారు. ఈ క్రమంలో ప్రజలు కూడా తెలియని వారిని గుడ్డిగా నమ్మకూడదని సూచించారు.