గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవి 20 మంది అర్హులైన లబ్ధిదారులకు రూ.31 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు శనివారం పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు పేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని ఆమె పేర్కొన్నారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో సీఎం సహాయనిధి ద్వారా రూ. 4.93 కోట్లకు పైగా సహాయం అందించామని తెలిపారు.