కరోనా మహమ్మారి(Covid 19) గత మూడేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను వణికించింది. ఈ మహమ్మారి ముప్పు పూర్తిగా తొలగిపోయిందని చెప్పడానికి లేదు. కరోనా కేసులు, మృతుల సంఖ్యలో అమెరికానే (America) మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు మరో బ్యాక్టీరియా అగ్రరాజ్యాన్ని కలవరపెడుతోంది.
కరోనా మహమ్మారి(Covid 19) గత మూడేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను వణికించింది. ఈ మహమ్మారి ముప్పు పూర్తిగా తొలగిపోయిందని చెప్పడానికి లేదు. కరోనా కేసులు, మృతుల సంఖ్యలో అమెరికానే (America) మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు మరో బ్యాక్టీరియా అగ్రరాజ్యాన్ని కలవరపెడుతోంది. ఇక్కడ గత కొంతకాలంగా షిగెల్లా అనే బ్యాక్టీరియా (Shigella bacteria) వ్యాప్తి చెందుతోంది. ఈ బ్యాక్టీరియా (bacteria) కారణంగా సంభవించే ఇన్ ఫెక్షన్ కేసులు పెరుగుతున్నట్లు అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా యాంటీ బయోటిక్స్ రెసిస్టెంట్ కేసులు పెరగడం ఆందోళనకరమని, వీటిపై అప్రమత్తంగా ఉండాలని సీరియస్ పబ్లిక్ హెల్త్ అలర్ట్ ను (Public Health Alerts) జారీ చేసింది. సాధారణంగా చికిత్సలో యాంటీ బయోటిక్స్ కు స్పందించని ఇన్ ఫెక్షన్ ను XDR గా పిలుస్తారు. ఈ తరహా షిగెల్లా XDR కేసు 2015 వరకు అమెరికాలో ఒక్క కేసు నమోదు కాలేదు. ఆ తర్వాత నుండి ప్రారంభమైన ఈ కేసులు, 2019 నాటికి ఒక శాతం నమోదయ్యాయి. 2022లో ఐదు శాతం నమోదయ్యాయి. ట్రీట్మెంట్ లో ఉపయోగించే అయిదే యాంటీ బయోటిక్స్ ను ఇది నిరోదిస్తుందని, చికిత్సకు ఇబ్బందిగా మారిన ఈ బ్యాక్టీరియాపై అప్రమత్తంగా ఉండాలని అమెరికా సీడీసీ అలర్ట్ జారీ చేసింది.
షిగెల్లా బ్యాక్టీరియా ఒకరి నుండి మరొకరికి సులభంగా వ్యాప్తి చెందుతుంది. జ్వరం, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, అలసట ఈ వ్యాధి లక్షణాలు. కలుషిత నీరు, పాడైన ఆహారం తీసుకోవడం వల్ల ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధి సంక్రణ అయిదేళ్లలోపు పిల్లలకు ప్రమాదకారిగా మారుతుంది. శుభ్రంగా ఉండటం, కాచి చల్లార్చిన నీళ్లు తాగడం తదితర జాగ్రత్తలతో ఈ వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చు. షిగెల్లా కేసులు భారత్ లోను గతంలో నమోదయింది. కేరళలో ఓ బాలుడు చనిపోయాడు.