»Ktrs Response To The Young Womans Tweet Dgp Enters The Field
Minister ktr : యువతి ట్వీట్‌కు కేటీఆర్ స్పందన.. రంగంలోకి డీజీపీ
టిట్టర్‌లో ఆస్క్ కేటీఆర్ (Ask KTR on Twitter)నిర్వహించి నెటిజన్లకు టచ్ లో ఉంటారు మంత్రి కేటీఆర్. తాజాగా ఓ మహిళా ప్రయాణికురాలు ట్వీట్ పై మంత్రి కేటీఆర్ స్పందించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station)వద్ద మెట్రో, బస్సు సర్వీసులు అందుబాటులో లేని సమయంలో అంటే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మహిళలకు క్యాబ్ లేదా ఆటో సర్వీసులు(Cab or auto services) ఏర్పాటు చేయాలని కోరారు.
తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (Minister ktr) సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటారు. ఏదైనా సమస్య పై లేదా హెల్ప్ కోసం ట్వీట్టర్ లో కేటీఆర్ ను ట్యాగ్ చేస్తే ఆయన వెంటనే స్పందిస్తారు.కేటీఆర్ ఆఫీస్ కు ఆదేశాలు ఇస్తూ ఆ సమస్య పరిష్కరించాలని సూచిస్తారు. అలాగే తరచూ ప్రజా సమస్యలపై ఆయన చర్చిస్తుంటారు. టిట్టర్‌లో ఆస్క్ కేటీఆర్ (Ask KTR on Twitter)నిర్వహించి నెటిజన్లకు టచ్ లో ఉంటారు మంత్రి కేటీఆర్. తాజాగా ఓ మహిళా ప్రయాణికురాలు ట్వీట్ పై మంత్రి కేటీఆర్ స్పందించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station)వద్ద మెట్రో, బస్సు సర్వీసులు అందుబాటులో లేని సమయంలో అంటే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మహిళలకు క్యాబ్ లేదా ఆటో సర్వీసులు(Cab or auto services) ఏర్పాటు చేయాలని కోరారు. వాటిని పోలీసులు ట్రాక్ చేసే విధంగా ఉండాలని హర్షిత (Harshita) అనే యువతి ట్విట్టర్ లో కోరారు. మంత్రి కేటీఆర్ స్పందిస్తూ… ఈ ట్వీట్ కు స్పందించిన మంత్రి కేటీఆర్..
యువతి సూచించిన సమయాల్లో మహిళలకు పోలీసుల (Police) ఆధ్వర్యంలో ఆటోలు లేదా క్యాబ్ లు ఏర్పాటు చేయాలని డీజీపీ అంజనీ కుమార్(DGP Anjani Kumar) కు సూచించారు. ట్రాక్ (Track) చేసే టెక్నాలిజీ వినియోగించి ఆటోలు ఏర్పాటు చేయాలని, ఈ పద్ధతినే రాష్ట్ర వ్యాప్తంగా అమలుచేయాలని డీజీపీని కోరారు. ఈ సూచనపై డీజీపీ అంజనీ కుమార్ స్పందించారు. మహిళలు సురక్షితమైన ప్రయాణం చేసేలా రవాణా సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ట్వీట్ చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. రోజూ వివిధ పనుల నిమిత్తం రాకపోకలు సాగించే ప్రయాణికులు.. వివిధ ప్రాంతాలకు ప్రయాణించేవారు మరోవైపు. వీరూ స్టేషన్ నుంచి తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి బస్సులు లేదా ప్రైవేట్ ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు (Rtc buses) తిరుగుతున్నా అవి కిక్కిరిసిపోతున్నాయి.
దీంతో ప్రయాణికులు ప్రైవేట్ ఆటోలు, క్యాబ్‌ల ద్వారా ఇంటికి చేరుకుంటున్నారు. దీనిని అదనుగా భావించి వారు ఇష్టారీతిన ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు.ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో ప్రభావితం చేసే జాబితాలో కేటీఆర్: గతంలోనే ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో(On social media) ప్రభావితం చేసే జాబితాలో కేటీఆర్ చోటు సంపాదించారు. ప్రపంచ వ్యాప్తంగా మొదటి 30 మంది జాబితాలో ఆయనకు స్థానం సంపాదించారు. ఇద్దరు యువనేతలు మాత్రమే భారతదేశం నుంచి ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అందులో మంత్రి కేటీఆర్ (Minister ktr) 12వ స్థానం కాగా.. మరొకరు ఎంపీ రాఘవ్ చద్దా (MP Raghav Chadha) 23వ స్థానంలో నిలిచారు. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న.. తెలంగాణ ఐటీ మంత్రిత్వ శాఖ 22వ స్థానంలో నిలిచింది.