In the hands of cyber criminals Rs. Khammam young woman looting 91 thousand
Job Scam : హైదరాబాద్ లో భారీ కుంభకోణం బయట పడింది. నిరుద్యోగుల అవసరాలను ఆసరాగా చేసుకున్న దొంగలు అందినకాడికి దోచుకున్నారు. పార్ట్ టైమ్ జాబ్స్ పేరుతో భారీ మోసానికి తెరతీశారు. ఒకటి కాదు రెండు కాదు.. 524 కోట్లు దొంగలు దోచుకున్నారు. హైదరాబాద్ లోనే కాదు దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు నిందితులు కుచ్చు టోపీ పెట్టారు. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. ఈ కేసు ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది.
ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న పార్ట్ టైమ్ జాబ్స్ ముఠాపై ఈడీ ఉక్కుపాదం మోపింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ. 524 కోట్లకు పైగా ఈ ముఠా వసూలు చేసినట్లు ఈడీ గుర్తించింది. పార్ట్ టైమ్ ఉద్యోగాల పేరుతో దేశవ్యాప్తంగా నిరుద్యోగులను మోసం చేశారని ఈడీ పేర్కొంది. కేవలం 15 రోజుల్లోనే రూ. 524 కోట్లను ఈ గ్యాంగ్ వసూలు చేసింది. 500 బ్యాంకుల్లో రూ. 32 కోట్ల నగదును ఈడీ అధికారులు సీజ్ చేశారు. క్రిప్టో కరెన్సీ ద్వారా ఈ ముఠా నగదును దుబాయ్‌కి తరలించినట్లు ఈడీ గుర్తించింది.
వాట్సాప్, టెలిగ్రామ్ యాప్‌ల ద్వారా పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో ప్రకటనలు ఇస్తారు. వీటికి ఆకర్షితులైన వారిని ఆయా గ్రూపుల్లో చేర్చుకుంటారు. బాధిత వ్యక్తుల మొబైల్ ఫోన్లలో నకిలీ వెబ్సైట్, యాప్‌ను ఇచ్చి డౌన్లోడ్ చేస్తారు. లాగిన్ కావాలంటే బ్యాంకు వివరాలతో సహా కీలక సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. ఆ తర్వాత పని పేరుతో కొన్ని టాస్క్ లు ఇస్తారు. తొలుత అందరినీ నమ్మిస్తూ డబ్బులు చెల్లిస్తారు. ఆ తరువాత అసలు కథ మొదలు పెడతారు. అందినకాడికి దోచేసుకుంటారు. దేశవ్యాప్తంగా 50కి పైగా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేయడంతో రంగంలోకి దిగిన ఈడీ విచారణ చేపట్టింది. ఈ నేరగాళ్ల అనేక బ్యాంకు ఖాతాలను ఈడీ ఫ్రీజ్ చేసింది.