టీఎస్ఆర్టీసీ (TSRTC) బిల్లుకు గవర్నర్ సౌందర్య తమిళిసై ఆమోదం తెలిపారు. తాజాగా ఆ బిల్లును ఆమోదిస్తూ సంతకం చేశారు.బిల్లులో గవర్నర్ చేసిన పది సిఫారసుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందిన గవర్నర్ తమిళిసై(Governor Tamilisai).. గురువారం ఆ బిల్లును ఆమోదించారు. ఎట్టకేలకు దాదాపు నెల రోజుల తరువాత తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బిల్లు 2023కు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులుగా కొత్త రోల్ ప్రారంభించారంటూ పేర్కొన్నారు. ఉద్యోగులకు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఎదురుకాకూడదనే ఉద్దేశంతోనే బిల్లును నిశితంగా పరిశీలించినట్లు వివరించారు.
న్యాయ సలహా కోరడంలో బిల్లుకు ఆమోదం తెలపడం కాస్త ఆలస్యమైందన్నారు. తాజాగా టీఎస్ఆర్టీసీ విలీన బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో తెలంగాణ (Telangana) ఆర్టీసీలో పనిచేస్తున్న మొత్తం 43,373 మంది ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు.ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడం హర్షణీయమని ఎంపీ బండి సంజయ్ (MP Bandi Sanjay) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ తమిళసై కార్మికుల పక్షపాతి అని తెలిపారు. భవిష్యత్తులో ఏ ఇబ్బంది రాకూడదనే ఆ బిల్లును పూర్తిగా అధ్యయనం చేశారని… అందులోని లోపాలను ఎత్తి చూపారని అన్నారు. ఇది జీర్ణించుకోలేని సీఎం కేసీఆర్ (CMKCR).. గవర్నర్కు లేనిపోని దురుద్దేశాలు ఆపాదిస్తూ కించపర్చే కుట్రకు తెరలేపారని మండిడ్డారు. ఆర్టీసీ కార్మికుల్లో లేనిపోని అపోహలు సృష్టించారని.. అయినప్పటికీ గవర్నర్ వెరవలేదని సంజయ్ తెలిపారు