»Tamil Nadu Cm Stalin Gave Instructions To The Dmk Party No Speak On Sanatana Dharma Bjp Prime Minister Modi
CM Stalin: మోడీకి భయపడి వెనక్కి తగ్గిన సీఎం స్టాలిన్.?
తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతనధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తరువాత దేశవ్యాప్తంగా ఎలాంటి పరిణమాలు చోటుచేసుకున్నాయో చూస్తూనే ఉన్నాము. దీనిపై ఎవరూ మాట్లాడొద్దని సీఎం స్టాలిన్ ఆదేశించారు. మోడీకి భయపడే ఈ నిర్ణయం తీసుకున్నారా అని రాష్ట్రమంతా చర్చ జరుగుతోంది.
Tamil Nadu CM Stalin gave instructions to the DMK party no speak on Sanatana Dharma BJP Prime Minister Modi.
CM Stalin: తమిళనాడు(Tamil Nadu)లో నిర్వహించిన సనాతన ధర్మ నిర్మూలన సభలో తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్(Udayanidhi Stalin) సనాతన ధర్మంపై(Sanatana Dharma) అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. ఆయన మాటలను ఖండిస్తూ బీజేపీ(BJP ) శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలు, చర్చలు చేపట్టారు. దీనిపై నటుడు, మంత్రి ఉదయనిధి వివరణ ఇచ్చిన తరువాత కూడా ఈ వివాదం ఆగలేదు. ఆ మధ్య తన కుమారుడు చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదని స్టాలిన్ స్పందించారు. అయినా సరే బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా దీనిపై చర్చిస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై ముఖ్యమంత్రి స్టాలిన్ రియాక్ట్ అయ్యారు. ఆ విషయంపై ఎవరూ మాట్లాడకూడదని పార్టీ శ్రేణులకు ఆదేశాలు ఇచ్చారు.
సనాతన ధర్మంపై చర్చకు దూరంగా ఉండాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సనాతన ధర్మానికి మద్దతుగా స్పందించాలంటూ ప్రధాని మోదీ(Modi) తన కేబినెట్ మంత్రులకు కొన్ని రోజుల క్రితం సూచించారు. దీనిపై రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పడానికి ఇది స్పష్టమైన ఉదాహరణ అని, అందుకు తగ్గట్టుగానే ఒక కేంద్రమంత్రి ప్రతి రోజూ సనాతన ధర్మం(Sanatana Dharma)పై మాట్లాడుతూ.. ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బీజేపీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చేస్తున్న ట్రాప్ లో మనం పడిపోకూడదని స్టాలిన్ తమ పార్టీ నాయకులకు తెలిపారు. అయితే బీజేపీ ప్రభుత్వం ఎత్తుగడల నుంచి దేశాన్ని కాపాడాలని ఆయన వివరించారు. దీనిపై ప్రధాని మోడీకి భయపడే ఇలా వెనక్కి తగ్గాడని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. ఎక్కువగా మాట్లాడితే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని, అందుకే డీఎమ్‌కే(DMK) పార్టీ నాయకులకు కట్టుదిట్టమైన ఆదేశాలను ఇచ్చారని ప్రతి పక్షాలు పేర్కొంటున్నాయి. ఓ సభలో భాగంగా సనాతనధర్మం అనేది డెంగ్యూ, మలేరియా లాంటిదని, దాన్ని సమూలంగా నిర్మూలించాలని ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. అప్పటి నుంచి దీనిపై రగడ జరుగుతూనే ఉంది. ఈ విషయంపై మతాధిపతులు, పఠాధిపతులు ఇప్పటికే స్పందించారు.