GNTR: పదో తరగతి ఫలితాలను మెరుగుపరిచేందుకు జిల్లా విద్యాశాఖ 100 రోజుల ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తోంది. దీనిపై నిర్వహించిన స్లిప్ టెస్ట్ రివ్యూలో డీఈవో సలీమ్ బాషా మాట్లాడారు. గత 13 రోజులుగా గుర్తించిన లోపాల ఆధారంగా వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలని ఆదేశించారు. విద్యార్థుల ఇబ్బందులను తొలగించి, వారి ప్రగతికి కృషి చేయాలన్నారు.