»Pawan Kalyan Announces Alliance With Tdp At Jail Premises
Pawan: టీడీపీ- జనసేన మధ్య పొడిచిన పొత్తు.. జైలు వేదికగా జనసేనాని ప్రకటన
ఏపీలో వచ్చే ఎన్నికలకు సంబంధించి పొత్తు పొడిచింది. టీడీపీ- జనసేన కలిసి పోటీ చేస్తాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. రాజమండ్రి జైలులో చంద్రబాబును కలిసి.. జైలు బయట ప్రకటన చేశారు.
TDP Chief Chandrababu Naidu Recommend This Seat To PK?
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ- జనసేన పొత్తుపై జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని.. తమతో బీజేపీ కూడా కలిసి వస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ను ఎదుర్కొనేందుకు కలిసి నడువాలని నిర్ణయం తీసుకున్నామని.. ఇరువైపుల కమిటీలు ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టంచేశారు. పొత్తులపై పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రకటన చేసింది మాత్రం రాజమండ్రి జైలు సమీపంలో కావడం విశేషం. ఎన్నికలకు సంబంధించి అలయెన్స్ పార్టీ ఆఫీసు, లేదంటే హోటల్ వద్ద జరగాలి.. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో.. జైలులో ఉన్న చంద్రబాబును కలిసి, బయట మీడియా ముందు పవన్ కల్యాణ్ ప్రకటన చేశారు.
జైలు వేదికగా ప్రకటన
వచ్చే ఎన్నికల్లో టీడీపీ- జనసేన కలిసి పోటీచేస్తాయని అందరూ ఊహించిందే. ఎందుకంటే 2014లో టీడీపీ అధికారంలోకి రావడానికి పరోక్ష కారణం పవన్ కల్యాణ్.. అప్పుడు టీడీపీ తరఫున ప్రచారం చేశారు. 2019లో మాత్రం ఒంటరిగా పోటీకి దిగారు. ఆశించిన ఫలితం లేదు. మరోసారి అలా జరగొద్దని.. సమయం దొరికితే చాలు ప్రజల ముందుకు వస్తున్నారు జనసేనాని. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్‌లో చంద్రబాబును అరెస్ట్ చేయడంతో ఈ రోజు సంఘీభావం తెలిపేందుకు జైలుకు వచ్చారు. ఓ మాజీ ముఖ్యమంత్రి పరిస్థితే ఇలా ఉంటే.. ఇక సామాన్యుల సంగతి ఏంటీ అని అంటున్నారు. అందుకే కలిసి నడువాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇదే విషయం లోపల బాబుకు చెప్పానని.. మీడియా ముందు పవన్ ప్రకటన చేశారు. వైసీపీని ఎదుర్కొనేందుకు కలిసి పోటీ చేయాలని డిసిషన్ తీసుకున్నామని స్పష్టంచేశారు. తమతో బీజేపీ కూడా కలిసి వస్తోందని ఇండికేషన్స్ ఇచ్చారు. దీనిపై స్థానిక బీజేపీ, కేంద్ర బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
మరీ బీజేపీ..?
తొలి నుంచి జనసేన- బీజేపీ కలిసి వెళతాయని ప్రకటించాయి. మారిన పరిస్థితుల నేపథ్యంలో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని పవన్ అంటున్నారు. తమతో బీజేపీ కూడా వస్తోందని చెబుతున్నారు. తమ ప్రత్యర్థి జగన్ అని.. విధానాలపై పోరాటం అని తేల్చిచెప్పారు. సీట్లపై ఇప్పుడే చర్చించలేదని క్లారిటీ ఇచ్చారు. మూడు పార్టీలు కలిసి.. బలమైన అభ్యర్థులను నిలిపి, అధికారం చేపడుతామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో జరుగుతోన్న వేధింపులకు స్వస్తి పలుకుతాం అని.. అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని పాలిస్తామని చెబుతున్నారు. పవన్ చెబుతుంటే బాగుంది.. కానీ సీట్ల లెక్కలు, అభ్యర్థుల అలకలతో ఏం జరుగుతుందో చూడాలీ. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ అధికారం చేపడుతోందని పలు సర్వేలు చెబుతున్నాయి. అందుకే సీఎం జగన్.. చంద్రబాబు అరెస్ట్ చేసే సాహసం చేశారని విశ్లేషకులు చెబుతారు. లేదంటే ఎన్నికలకు ముందు ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే వారు కాదని ఉదహరిస్తున్నారు.
యుద్ధానికి సిద్ధమే
ఏపీ అభివృద్ధి ముఖ్యం అని పవన్ కల్యాణ్ మరీ మరీ చెబుతున్నారు. కాదు.. కూడదు, తమకు యుద్ధమే కావాలని జగన్ కోరుకుంటే.. దానికి కూడా సిద్ధం అని ప్రకటన చేశారు. పవన్ ప్రకటనతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. వైసీపీతో తాడో పేడో తేల్చుకోవడానికి జనసేనాని సిద్ధం అయ్యారని ఆయన మాటల ద్వారా తెలుస్తోంది. మరీ దీనికి వైసీపీ ఎలా ముందుకెళ్తుందో చూడాలీ. మరో ముఖ్య విషయం.. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ తర్వాత వరసగా ఇతర కేసులు చంద్రబాబును చుట్టుమట్టనున్నాయి. సో.. ఇప్పుడే బాబును బయటకు పంపించేందుకు సీఎం జగన్ ఇష్టపడటం లేదని అర్థం అవుతోంది. అలా అయితే టీడీపీ-జనసనే అలయన్స్ లీడ్ చేసేది పవన్ కల్యాణ్ అవుతారు. లోకేశ్‌కు పవన్ కల్యాణ్ అంతా అనుభవం లేదు. బాలకృష్ణ ఉన్నప్పటికీ.. ఆయనకు రాజకీయంగా నాలెడ్జ్ తక్కువే అంటారు ఆనలిస్టులు. సో.. ఏపీలో ప్రతిపక్షాన్ని నడిపించే బాధ్యత పవన్ కల్యాణ్ భుజాల మీద పడింది.
మోదమా..? ఖేదమా..?
పొత్తులకు సంబంధించి కీలక ప్రకటన రాజమండ్రి జైలు బయట నుంచి వచ్చింది. దీనిపై టీడీపీ- జనసేన ఆలోచించి.. సీట్లపై ప్రకటన చేయాల్సి ఉంది. బీజేపీని ఒప్పిస్తానని పవన్ అంటున్నారు.. మరీ ఆ పార్టీ నేతలు ఒప్పుకుంటారో, లేదంటే.. వ్యతిరేకిస్తారో అనే సందేహాం నెలకొంది. సో.. ఏపీలో వచ్చే ఎన్నికలకు సంబంధించి అప్పుడే పొత్తు పొడిచాయి. ఆ కార్యాచరణ రూపొందించడంలో ఆ రెండు పార్టీల నేతలు బిజీగా ఉన్నారు. మరీ వీరిని ప్రజలు ఆమోదిస్తారా..? అధికారం కట్టబెడుతారో లేదో అంటే.. కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.