తెలంగాణ ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. మహిళల ఆరోగ్య విషయంలో కేసీఆర్ సర్కార్ ఇప్పటికే అనేక ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోంది. అందులో భాగంగానే మహిళా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని సర్కార్ ప్రారంభించింది. మార్చిలో ప్రారంభించిన ఈ కార్యక్రమం నేడు వారానికో ప్రత్యేక క్లినిక్‌లను నిర్వహించే మరో 100 కేంద్రాలను ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది.
సెప్టెంబర్ 12 నుంచి అదనంగా మరో 100 కేంద్రాలను ప్రారంభించనున్నట్లు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, ఆర్థిక శాఖల మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఆరోగ్య మహిళా పథకాన్ని 272 కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. వచ్చే మంగళవారం నుంచి మరిన్ని అందుబాటులోకి రానున్నాయి. దీంతో మహిళల కోసం ఏర్పాటు చేసిన హెల్త్ సెంటర్ల సంఖ్య 372కు చేరకుంది.
ఈ హెల్త్ సెంటర్లలో మహిళలకు 8 రకాల వ్యాధులకు సంబంధించిన చికిత్స అందిస్తారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేసే అన్ని రకాల చికిత్సలు ఇక్కడ ఉచితంగా లభించనున్నాయి. ప్రతి మంగళవారం మహిళల కోసం ఈ హెల్త్ క్లినిక్ లల్లో ప్రత్యేక వైద్య పరీక్షలు కూడా అందుబాటులో ఉంటాయి.