»A Shock To The People Of Telangana The Sale Of Those Lands Is No Longer Valid
HighCourt: తెలంగాణ ప్రజలకు షాక్.. ఆ భూముల అమ్మకం ఇక చెల్లదు!
తెలంగాణలో అసైన్డ్ భూముల అమ్మకం చెల్లదని రిపబ్లికన్ పార్టీ కోర్టులో పిల్ దాఖలు చేసింది. విచారించిన కోర్టు రాష్ట్ర సర్కార్‌కు పలు నివేదికల సమాచారం అందించాలని ఆదేశాలిచ్చింది. విచారణను ధర్మాసనం మరో రెండు వారాలకు వాయిదా వేసింది.
తెలంగాణ (Telangana)లో అసైన్డ్ భూముల (Assigned Lands) అమ్మకం ఇక చెల్లదని కోర్టు తెలిపింది. సీఎం కేసీఆర్ సర్కార్ తెలంగాణ అసైన్డ్ భూముల చట్టం 1977కు 2018లో సవరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ రిపబ్లికన్ పార్టీ (Telangana Republican Party) హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాక్ట్ 12ను కొట్టివేయాలని రిపబ్లికన్ పార్టీ కోరింది. బుధవారం దీనిపై జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది.
అసైన్డ్‌దారులకు హక్కులు కల్పించేలా తెలంగాణ అసైన్డ్ భూముల చట్ట సవరణపై వివరాలు అందించాలని సర్కార్‌కు కోర్టు నోటిసులిచ్చింది. పేదల ఆర్థిక స్వాతంత్య్రం కోసం 1969లో అప్పటి సర్కార్ సాగు భూమిని అందించిందన్నారు. అయితే ఆ ప్రజల నిరక్ష్యరాస్యతను అలుసుగా తీసుకుని కొందరు తక్కువ ధరలకే ఆ భూములను కొనుగోలు చేశారన్నారు.
సుమారు రూ.50 లక్షల నుంచి రూ.కోటి విలువ చేసే భూములను కేవలం రూ.5 లక్షలకే కొనుగోలు చేసినట్లు తెలిపారు. 1977, తెలంగాణ అసైన్డ్ భూముల చట్టం సెక్షన్3 ప్రకారంగా అసైన్డ్ భూముల అమ్మకం చెల్లదని తెలంగాణ రిపబ్లిక్ పార్టీ తమ వాదనలు వినిపించింది. ఆ అమ్మకం చెల్లదని తెలిపింది. ప్రస్తుతం అసైన్డ్ భూములను థర్డ్ పార్టీలకు అప్పగించేలా ప్రభుత్వం చట్ట సవరణ చేయడం మంచిదికాదన్నారు.
అసైన్డ్ భూములు (Assigned Lands) రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల ఎకరాలు ఉంటే ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 74 వేల ఎకరాలు ఉన్నాయి. ఇరువురి వాదనలు విన్న కోర్టు రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన న్యాయమూర్తి, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితోపాటు చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్(సీసీఎల్ఏ)కు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసినట్లు ప్రకటించింది.