»Free Journey For Women In Telangana Pallevelugu Rtc Bus And Express
Free bus journey: పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ
రాష్ట్రంలో మహిళలు, యువతులు ఆర్టీసీ పల్లెవెలుగు, ఎక్స్ ప్రైస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని కాంగ్రెస్ ప్రభుత్వం మార్గదర్శకాలు ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం గురించి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మార్గదర్శకాలు విడుదల చేశారు. ఈ స్కీం ప్రకారం తెలంగాణలో నివాసముంటున్న మహిళలు, అన్ని వయసుల బాలికలు, ట్రాన్స్జెండర్లు ఉచితంగా ప్రయాణించే ‘మహాలక్ష్మి పథకం’ను ప్రారంభిస్తూ తెలంగాణ రవాణా శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో డిసెంబర్ 9 నుంచి పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లు రాష్ట్ర సరిహద్దుల్లో ఎక్కడికైనా ప్రయాణించవచ్చని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ఇంటర్-స్టేట్ ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సులలో తెలంగాణ సరిహద్దుల వరకు ప్రయాణం ఉచితమని ప్రకటించారు. మహిళా ప్రయాణికులు ప్రయాణించే వాస్తవ దూరం ఆధారంగా వసూలు చేసే ఛార్జీల కోసం తెలంగాణ ప్రభుత్వం TSRTCకి ఖర్చును తిరిగి చెల్లిస్తుంది. మహాలక్ష్మి ఉచిత బస్సు పథకాన్ని రేపు మధ్యాహ్నం 1:30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో మేలో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఇదే స్కీం అమలు చేస్తామని ప్రకటించింది. అయితే ఈ స్కీంలో భాగంగా మొదటి వారం రోజులు మహిళలు ఐడీ కార్డు లేకున్నా కూడా ప్రయాణం చేయవచ్చని చెప్పారు. సాధారణంగా ఆధార్ కార్డును మహిళలు చూపించడం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ప్రకటించారు.