NZB: నగరంలోని గూపన్ పల్లి శివారులో చెట్టుకు ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు రూరల్ టౌన్ NHAI శ్రీనివాస్ తెలిపారు. గ్రామానికి చెందిన చింతల ఏడ్డి రాజన్న (50) గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ శనివారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకున్నట్లు చెప్పారు. మృతుని భార్య పదేళ్ల క్రితం మృతి చెందింది. ఆయనకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు.