WGL: ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు పాస్పోర్ట్ అధికారులు శుభవార్త అందించారు. పాస్పోర్ట్ కోసం ప్రత్యేకంగా ఎం-పాస్పోర్ట్ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవడం, వివరాలు తెలుసుకోవడం, అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడం, ఫీజులు చెల్లించడం, పత్రాలు అప్లోడ్ చేయడం, పాస్పోర్ట్ స్టేటస్ ట్రాక్ చేయడం వంటి సేవలను స్మార్ట్ఫోన్ నుంచే పొందవచన్నారు.