HYD: నగరంలోని బుద్ధభవన్‌లో సోమవారం హైడ్రా ప్రజావాణి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 47 ఫిర్యాదులు అందినట్లు హైడ్రా అ. కమిషనర్ అశోక్ కుమార్ తెలిపారు. పార్కులు నామరూపాలు లేకుండా చేస్తున్నారని, లే ఔట్లలో పార్కుల కోసం కేటాయించిన స్థలాలన్నింటికీ ఫెన్సింగ్‌లు వేసి కాపాడాలంటూ పలువురు ఫిర్యాదు చేశారన్నారు. పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించామని ఆయన తెలిపారు.