సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈనెల 22 నుంచి మార్చి 9 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని CP రష్మీ పెరుమాళ్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు నిర్వహించకూడదన్నారు. పైన పేర్కొన్న కార్యక్రమాల నిర్వహణకు ముందుగా సీపీ అనుమతి తీసుకోవాలని సూచించారు. బంద్‌ల పేరిట కారణాలు చెబుతూ సంస్థలు, కార్యాలయాలు మూసివేయాలని చూస్తే చర్యలు తప్పవన్నారు.