HYD: ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రి ఆవరణలో రూ.1,100 కోట్లతో నిర్మించిన సనత్ నగర్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని డిసెంబరు 9న ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 1000 పడకలతో ఆధునిక వైద్య సేవల విభాగాలతో నిర్మించినట్లు రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా తెలిపారు.