KMM: జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం గ్యాస్ ఏజెన్సీ డీలర్లు, కంపెనీ సేల్స్ ఆఫీసర్లతో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో గృహావసరాలకు సరిపడా LPG నిల్వలు ఉన్నాయని, గ్యాస్ కొరత ఉందంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. ప్రజలు అనవసరంగా భయాందోళనలకు గురై ముందస్తు బుకింగ్లు చేసుకోవద్దని తెలిపారు.