BDK: పాల్వంచ మండలంలోని నాలుగు గ్రామపంచాయతీల్లో సర్పంచులు ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బిక్కు తండాకు ఝాన్సీ, తవిశలగూడెంకి రమేష్, సంగంకి రవి, ఇల్లెందులపాడు తండాకు తేజవత్ లక్ష్మి సర్పంచులుగా ఎన్నుకోబడ్డారు. మండలంలోని 36 పంచాయతీలకు గాను 35 పంచాయతీల్లోనే నామినేషన్లు దాఖలయ్యాయి. పాండురంగాపురం పంచాయతీలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.