SRPT: తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలంటూ సోమవారం విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకులు చిన్ని కృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. విద్యార్థులు కాలేజీకి, స్కూల్‌కి వెళ్లడానికి బస్సు సౌకర్యం లేక మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ రావులపల్లి ఎక్స్ రోడ్డుకి వెళ్లి ఉప్పల్ బస్సు ఎక్కి వెళ్తున్నారని తెలిపారు.