RR: మొయినాబాద్లో గాలివాన బీభత్సానికి బీజాపూర్ రహదారిపై ఫ్లెక్సీలు, సైన్ బోర్డులు చినిగి ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. ఇవి ఎప్పుడైనా వాహనదారులపై పడే అవకాశం ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ప్రమాదాలు జరగకముందే మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి, ఆ బోర్డులను తొలగించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.