SRPT: పేదలకు ఇందిరమ్మ ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే సామేలు అన్నారు. సోమవారం నూతనకల్ మండలం బక్కా హేమ్లా తండాలో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా డబుల్ బెడ్ రూమ్ ఇవ్వకుండా అన్ని వర్గాలను మోసం చేసిందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వం ఇస్తుందన్నారు.