ASR: గిరిజన విద్యార్థులు ఎందులోనూ తీసిపోరని గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. 21వేల మంది విద్యార్థులు గత 5నెలలుగా యోగ సాధన చేస్తూ సోమవారం అరకులో 108సూర్య నమస్కారాలతో ప్రపంచ రికార్డ్ సాధనకు ముందుకు రావడం హర్షించే విషయమన్నారు. యోగా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. 5మండలాలకు చెందిన సుమారు 21,850 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.