ప్రకాశం: కొండపి మండలం K. ఉప్పలపాడులో జరిగిన లైంగిక దాడి ఘటనపై కొండపి ఎస్సై ప్రేమ్ కుమార్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసును దర్యాప్తు చేసిన కనిగిరి సబ్ డివిజన్ డీఎస్పీ సాయి ఈశ్వర్ ముద్దాయిని అరెస్టు చేసి కనిగిరి కోర్టులో సోమవారం ప్రవేశపెట్టారు. కాగా కనిగిరి కోర్టు జడ్జి ముద్దాయికి 11 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్సై ప్రేమ్ తెలిపారు.