SRD: పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఈనెల 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ జానకి దేవి సోమవారం ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు అర్హులని చెప్పారు. దరఖాస్తులను www.polycet.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.