ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన RCB నిర్ణీత ఓవర్లలో 221 పరుగులు చేసింది. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన MI 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. తిలక్(52) హార్దిక్ (42) మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో బెంగళూరు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.