SKLM: మద్యం సేవించి వాహనం నడుపుతు పట్టుబడిన వాహనదారుల లైసెన్స్‌లను చట్ట ప్రకారం రద్దు చేయడం జరుగుతుందని ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే 70 మంది వాహన చోదకులు లైసెన్సులు రద్దు చేశామన్నారు. మరో 60 మంది వాహన చోదకులు యొక్క లైసెన్స్‌ల రద్దుకు రవాణా కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపించామన్నారు.