VZM: కోరుకొండ రైల్వే స్టేషన్ సమీపంలోని గుండాలపేట వద్ద సోమవారం గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించినట్లు GRP ఎస్సై బాలాజీరావు తెలిపారు. మృతుడి వయస్సు 45 నుండి 50 సంవత్సరాల మధ్య ఉంటాయన్నారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు తమను సంప్రదించాలని కోరారు. ఈ మేరకు హెచ్‌సి కృష్ణారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.