ELR: ఉంగుటూరు మండలం కాగుపాడు పంచాయతీ సర్పంచ్ కడియాల సుధేష్ణను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీలో పలు ఆర్థిక అవకతవకలు జరిగాయని వార్డు సభ్యుడు వంకిన మాధవరావు చేసిన కంప్లైంట్ ఆధారంగా అధికారులు విచారణ చేశారు. ఈ క్రమంలో సర్పంచును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు.