SRD: టెక్నాలజీకి మహిళల శక్తి తోడైతే అభివృద్ధి జరుగుతుందని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో సోమవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యవసాయ ఉద్యానవన పంటలకు మహిళలు డ్రోన్ ద్వారా సేవలందిస్తే అదనపు ఆదాయం పొందవచ్చని చెప్పారు. డ్రోన్ శిక్షణను రాష్ట్రంలో మొదటిసారిగా మన జిల్లాలోనే ప్రారంభించినట్లు పేర్కొన్నారు.