VSP: ఏపీ జీఎస్డీపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు గిమ్మిక్కులతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ జీఏస్డీపీలో రెండోస్థానంలో ఉందని సీఎంగా చంద్రబాబు గొప్పగా ప్రకటించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.