NLG: శాలిగౌరారం మండలంలోని ఎన్జీ కొత్తపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నూనెముంతల సత్తయ్య (72) ఇవ్వాళ తన పొలంలో వరి కొయ్యలకు నిప్పు పెట్టే సమయంలో మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో పొగలో చిక్కుకుని మృతి చెందాడు. మంటలతో తీవ్ర గాయాలపాలైన ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.