RR: ఈరోజు సరూర్ నగర్ SE సర్కిల్ కార్యాలయం వద్ద చంపాపేట్, ఇబ్రహీంపట్నం, సరూర్ నగర్ డివిజన్ల మీటర్ రీడర్లు టెంట్లు వేసి ధర్నా చేపట్టారు. అలాగే వంట-వార్పు కార్యక్రమం నిర్వహించారు. నెలకు 30 రోజుల పని దినాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి రాజకీయ నాయకులను కలిసి తమ సమస్యను వివరిస్తామని తెలిపారు.