ADB: కేంద్ర రక్షణ శాఖ నిర్వహించిన ప్రతిష్టాత్మక వీరగాథ 5.0 పోటీల్లో ప్రతిభ కనబరిచిన జిల్లాకు చెందిన రిషాంత్ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఈ మేరకు విద్యార్థిని కలెక్టరేట్ కార్యాలయంలో అభినందించి, ప్రశంసా పత్రం అందజేశారు. బుద్ధమహర్ గూడ అనే మారుమూల గ్రామానికి చెందిన రిషాంత్ దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు.