WGL: నర్సంపేట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 56వ NSUI ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జయ్యారపు అఖిల్ కేక్ కట్ చేసి కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల హక్కుల కోసం ఎల్లప్పుడూ పోరాడుతామని, యువతకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించడంలో NSUI ముందుంటుందని తెలిపారు.