KMM: రూరల్ మండలం తల్లంపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సూర్యాపేట నుంచి ఖమ్మం వస్తున్న ఆర్టీసీ బస్సు, ఒక కంటైనర్ లారీని ఢీకొట్టడంతో సుమారు పది మంది ప్రయాణికులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే క్షతగాత్రులను అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా ఖమ్మం-సూర్యాపేట జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.