HYD: మైదానంలో ఖాకీల ఫుట్బాల్ ఫైట్ మొదలుకానుంది. బుధవారం నుంచి గచ్చిబౌలి స్టేడియంలో 74వ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్బాల్ చాంపియన్షిప్ అట్టహాసంగా ప్రారంభం కానుంది. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఈ మెగా టోర్నీని ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా 43 జట్లు, వెయ్యి మందికి పైగా క్రీడాకారులు తలపడే ఈ క్రీడల వేదికలు గచ్చిబౌలి, గోల్కొండ సహా 5 చోట్ల ఉన్నాయి.