JGL: జగిత్యాలలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఇంగ్లిష్, కామర్స్, కంప్యూ టర్ సైన్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులను బోధించేందుకు మహిళా అభ్యర్థుల నుంచి గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ గునుక శ్రీలత తెలిపారు. అభ్యర్థులు ఈనెల 6న ఉదయం 10 గంటలకు నేరుగా కళాశాలలో నిర్వహించే డెమోకు హాజరుకావాలన్నారు.