NLG: అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి అన్నట్లుగా ఉంది జిల్లాలోని రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఆపదలో అక్కరపడతాయని కొనుగోలు చేసిన స్థిరాస్తులను అమ్మేందుకు యజమానులు పడరాని పాట్లు పడుతున్నారు. చివరకు లక్కీ డ్రా పేరుతో ప్లాట్లను విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ‘వెయ్యి కొట్టు ప్లాటు పట్టు’ అంటూ బ్రోచర్లను సిద్ధం చేసి కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.