HNK: నడికూడ(M) వరికోలులో ఉపాధి హామీ పనులను ఎంపీడీవో రామకృష్ణ పరిశీలించారు. అనంతరం ఉపాధి హామీ పనులు చేస్తున్న ప్రజలతో ఎంపీడీవో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి పనులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, పనులు చేసే వద్ద ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. కార్యదర్శి సాంబశివ, ఫీల్డ్ అసిస్టెంట్ కొమురయ్య ఉన్నారు.