NZB: ఇందూరు కోటపై వెలసిన శ్రీ రఘునాథ ఆలయానికి శతాబ్దాల ఘన చరిత్ర ఉంది. 12శతాబ్దంలో కాకతీయుల కాలంలో నిర్మితమైన ఈ కోట, తదనంతరం ఛత్రపతి శివాజీ పర్యవేక్షణలో పునర్నిర్మాణానికి నోచుకుంది. శివాజీ ఆధ్యాత్మిక గురువు సమర్థ రామదాసు ఇక్కడ తపస్సు చేశారని, ఆయన కోరిక మేరకే ఈ ఆలయం నిర్మించారని ప్రతీతి. ఇక్కడి కోదండరాముడిని దర్శించుకునేందుకు మహారాష్ట్ర నుంచి తరలివస్తుంటారు