RR: షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండలం మొదళ్లగూడ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగునుండగా, ప్రతి ఓటర్ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. కాగా.. సర్పంచ్‌ను ఎన్నుకునేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు.