SRCL: ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు పాఠ్య ప్రణాళికా సంఘం సభ్యుడిగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన కవి కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ పత్తిపాక మోహన్ ఎంపిక అయ్యారు. 2 ఏళ్ళ పాటు కొనసాగనున్నారు. గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ప్రస్తుతం నేషనల్ బుక్ ట్రస్టు తెలుగు సంపాదకుడిగా ఉన్నారు.