HYD: పుట్టినరోజున గిఫ్ట్ అంటే ఏముంటుంది? స్వీట్లు, డ్రెస్సులు.. మహా అయితే గ్యాడ్జెట్లు! కానీ ఈ హైదరాబాద్ కుర్రాడు మాత్రం అందరినీ ఆలోచింపజేసే ‘లైఫ్ టైమ్’ గిఫ్ట్ ఇచ్చాడు. సోమాదిత్య తన కిడ్డీ బ్యాంకులో దాచుకున్న రూ. 10 వేలతో చెల్లెలు సోనాక్షికి సర్వికల్ క్యాన్సర్ నివారణ టీకా వేయించాడు. “ఆడపిల్లల ఆరోగ్యం ముఖ్యం” అన్న ప్రభుత్వ సందేశం స్ఫూర్తితో ఈ ఆలోచన చేశాడు.