NLG: కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన కార్మిక కోడ్లను రద్దు చేయాలని జిల్లా మెడికల్ రిప్రజెంటేటివ్ ల సంఘం అధ్యక్షుడు పాల్వాయి హరిప్రసాద్ డిమాండ్ చేశారు. పాత కార్మిక చట్టాలనే కొనసాగించి కార్మికులకు భద్రత కల్పించాలని కోరుతూ సంఘం నాయకులతో కలిసి సోమవారం జిల్లా కలెక్టర్ కు వినతిని అందించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ రిప్రజెంటేటివ్‌లు పాల్గొన్నారు.