BHPL: రేగొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఇవాళ BHPL డివిజన్ పరిధిలోని విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల డీలర్లకు శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా వ్యవసాయ అధికారి జే. బాపూరావు హాజరై మాట్లాడారు. వానాకాల సీజన్ దృష్ట్యా రైతులకు విక్రయించే ప్రతి విత్తనానికి తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని సూచించారు.