NGKL: ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ ఆర్టీసీ డిపో ఎదుట సమ్మె చేస్తున్న కార్మికులకు ఆయన సంపూర్ణ మద్దతు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోయారని అన్నారు.